తొలి (శయన) ఏకాదశి

‘ఏరు ముందా, ఏకాదశి ముందా!’ అని నెల్లూరు జిల్లాలో ఒకసామెత ఉంది. ఆ సామెత తొలి ఏకాదశికి సంబంధించింది. వర్ష ఋతువు నుండి సంవత్సర ప్రారంభాన్ని పరిగణించడం వల్ల ఆషాఢ మాసంలోని శుద్ధ ఏకాదశి తిథి ‘తొలి ఏకాదశి’గా పేరొందింది.