శుభ పంచాంగమ్

గురువారం, 16 జూలై 2020. ఈరోజు తిథి విశేషం : కర్కాటక సంక్రాంతి రా.10.22ని.లకు, దక్షిణాయనం ప్రారంభం, సర్వ ఏకాదశి. అమృత ఘడియలు : మ.3.16-మ.5.01వ. దుర్ముహూర్తం : ఉ.9.56-ఉ.10.47వ. పునః దుర్ముహూర్తం : మ.3.06-మ.3.58వ.

తొలి (శయన) ఏకాదశి

‘ఏరు ముందా, ఏకాదశి ముందా!’ అని నెల్లూరు జిల్లాలో ఒకసామెత ఉంది. ఆ సామెత తొలి ఏకాదశికి సంబంధించింది. వర్ష ఋతువు నుండి సంవత్సర ప్రారంభాన్ని పరిగణించడం వల్ల ఆషాఢ మాసంలోని శుద్ధ ఏకాదశి తిథి ‘తొలి ఏకాదశి’గా పేరొందింది.