సంతాన సిరి-4

భారతీయ సంస్కృతిలో వివాహ సంస్కారం సర్వోన్నత ప్రాముఖ్యత- ‘సంతాన ప్రాప్తి’. మానవ జీవితంలో సంతానసుఖం సర్వోత్కృష్టమైంది. స్త్రీ పురుషులు సంతాన ప్రాప్తి పొంది, పితృఋణం తీర్చుకోవాలని వాంఛిస్తారు. సంతాన ప్రాప్తి వల్ల తండ్రికి ఇహ-పరలోక సుఖాలు లభిస్తాయి. ప్రపంచంలో సంతానం తల్లిదండ్రుల పేరు నిలబెడుతుంది.

సంతాన సిరి-3

స్త్రీని పరిగ్రహించనంత వరకు పురుషుడు సగమై ఉంటాడు. సగభాగంతో సంతానం కలగదు. వేదం సంతానాన్ని సృజించమని ఆదేశిస్తుంది. మన దేశంలో వివాహ ప్రయోజనం కేవలం శారీరక సుఖం కాదు. గృహస్థ జీవితం సరిగా నడపడానికి, వంశవృద్ధికి సంతానోత్పత్తి కావాలి. పుత్ర సంతానాన్ని పొందిన వానికి పితృఋణం నుండి విముక్తి లభిస్తుంది.

సంతాన సిరి-2

నాగపూజా ఫలం : రాహుజనిత యోగంలో సువర్ణ నాగ ప్రతిమ చేయించి విధ్యుక్తంగా పూజించి గోదానం, భూదానం, తిలదానం, సువర్ణదానం చేయడం వల్ల నాగేంద్రుని కృప కలిగి, పుత్రసంతానం ప్రాప్తిస్తుంది. వంశవృద్ధి జరుగుతుంది.

సంతాన సిరి-1

గురువు కీలకం : స్త్రీల జాతకంలో బృహస్పతి పతి, పుత్రకారక గ్రహం. వివాహ కారకుడు కూడా గురువే. ధార్మిక, దైవ కార్యాలు, కర్మకాండ, చట్ట సంబంధ కార్యాలు బృహస్పతి పరిధిలోకి వస్తాయి. శరీరంలో వసపై అతని అధికారం ఉంటుంది. కర్మకాండలో బలి, హవిస్సులు అతనికి సంబంధించినవి.