తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన సిద్ధాంతులు
రేలంగి తంగిరాల వారి పంచాంగం

కుంభ రాశి
వార్షిక ఫలితాలు

కుంభ రాశి జన్మనక్షత్రాలు

ధనిష్ఠ నక్షత్రం 3, 4 పాదాలు.
శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు.
పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు.

ఆదాయ – వ్యయాలు

శ్రీ శార్వరి నామ సంవత్సరం 2020 మార్చి 25 నుండి 2021 ఏప్రిల్ 12 వరకు.
ఈ సంవత్సరంలో కుంభ రాశి జాతకుల ఆదాయ-వ్యయాలు, గౌరవ-అగౌరవాలు.
ఆదాయం – 11; వ్యయం – 5;  గౌరవం – 5; అగౌరవం – 6.

గ్రహ సంచారం

కుంభ రాశి జాతకులకు- గురువు మార్చి 29, 2020 నుండి 12ట లోహమూర్తి (ధనహాని)గా, జూన్ 29 నుండి 11ట రజతమూర్తి (సౌభాగ్యం)గా, నవంబరు 20 నుండి 12ట లోహమూర్తిగానూ, తదుపరి ఏప్రిల్ 5, 2021 నుండి 1ట లోహమూర్తిగా సంచరిస్తాడు. శ్రీ శార్వరి సంవత్సరమంతా శని 12ట లోహమూర్తి (ధనహాని)గా సంచరిస్తాడు. రాహు-కేతువులు శార్వరి సంవత్సరాది నుండి సెప్టెంబరు 23, 2020 వరకు పంచమ, లాభ స్థానాల్లో సువర్ణమూర్తులుగా, తర్వాత చతుర్థ, దశమ స్థానాల్లో తామ్రమూర్తులుగానూ సంచరిస్తారు.

అనుకూల – ప్రతికూలతలు

కుంభ రాశి వారికి- గురుని లాభస్థాన సంచార కాలంలో సంతోషం, కీర్తి వృద్ధి, బలం, తేజస్సు, సర్వత్రా జయం, సభా గౌరవం, శత్రునాశనం, దేవతారాధన, మంత్రసిద్ధి కలుగుతాయి. ధనం నిల్వ చేస్తారు. గురుని ద్వాదశ స్థాన సంచార కాలంలో- శుభకార్యాల నిర్వహణకు వ్యయం, గృహంలో మంగళ తోరణాలు, అలంకరణ వస్తువులు కొనడానికి దుబారా ఖర్చులు చేయడం జరుగుతుంది. శని వ్యయరాశి సంచార కాలం- శారీరక, మానసిక పీడలను కలిగిస్తుంది. మనోవ్యధ, అశాంతికి లోనవుతారు. శని మూర్తిమంతం అయినప్పటికీ శుభ ఫలితాలు ఇవ్వలేడు. దోష పరిహారార్థం ఆంధ్రప్రదేశ్ మందపల్లిలో లేదా శనైశ్చర క్షేత్రంలో తైలాభిషేకాలు చేయడం మంచిది. రాహు-కేతువుల ఫలితాలు సామాన్యంగానే ఉన్నాయి. వాగ్వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకొంటే భంగపడవలసి వస్తుంది. కార్యహాని కలుగుతుంది.

శుభ ఫలితాలు

కుంభ రాశి వారికి- శార్వరి సంవత్సర పూర్వార్థంలో గురు, కేతు బలాలు అనుకూలం. విద్యార్థులు అధిక ఒత్తిడిని తట్టుకొని, ఉత్తమశ్రేణిలో ఉత్తీర్ణులవుతారు. ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు శార్వర సంవత్సర ఆరంభంలో అధికారుల ప్రశంసలు, మన్ననలు లభిస్తాయి. ప్రతిభా పురస్కారాలు పొందుతారు. రైతులకు మొదటి పంట అనుకూలం. రెండో పంట సామాన్యం. పాడిపంటలు అనుకూలం. మత్స్య, పౌల్ట్రీ యజమానులకు సంవత్సర పూర్వార్థంలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. గాయకులకు, నటులకు కూడా సంవత్సర పూర్వార్థమే అనుకూలం. ఉత్తరార్థం సామాన్యం. న్యాయవాదులకు, రాజకీయ నాయకులకు సన్మానాలు జరుగుతాయి.

ఉపాయాలు

కుంభ రాశి వారికి ఏలినాటి శని ప్రారంభమైనప్పటికీ శ్రీవేంకటేశ్వరస్వామి ఆరాధనతో సమస్త దోషాల నుండి ఉపశమనం కలుగుతుంది. వీరు సమస్త కార్యాల నిర్వహణలో ఏమరుపాటు లేకుండా జాగ్రత్తగా మెలగాలి.

జన్మనక్షత్రాల ప్రభావం

✶  ధనిష్ఠ నక్షత్రం జాతకులకు- నక్షత్ర స్థితిచే పూర్వార్థంలో సర్వ శుభాలు లభిస్తాయి. గృహంలో శోభాయమానమైన వాతావరణం. 
✶  శతభిషం నక్షత్రం వారికి- అనుకూల సమయం. విద్యా సుగంధ పరిమళం, ధన లాభాలు, వస్త్రాభరణాదులు, భూ-గృహ స్థిరాస్తుల సంపాదనకు నాంది.
✶  పూర్వాభాద్ర నక్షత్రం జాతకులకు- సంవత్సర ఉత్తరార్థంలో కళ్యాణాది శుభయోగాలు, వాగ్ధాటి సభా సమావేశాలు నిర్వహించడం, వ్యవహార జయం కలుగుతుంది.

అంకెల్లో అదృష్టం

కుంభ రాశి వారికి ‘8’ అదృష్ట సంఖ్య. 2, 3, 6, 9 తేదీల సంఖ్యలు- మంగళ, శుక్ర, సోమవారాలతో కలిస్తే మరింత యోగప్రదంగా ఉంటుంది.

జూలై 2020 : మాస ఫలితం

ఈ మాసాంతంలో ఆర్థిక విషయాల్లో కొంత ఊరట కలుగుతుంది. మొండి బాకీలు వసూలవుతాయి. అయితే గతంలో చేసిన బాకీల ప్రభావం ఉంటుంది. మానసిక వ్యధకు గురవుతారు. నిశ్చలమైన భక్తితో శ్రీలక్ష్మీ అష్టోత్తరం నిత్యం పఠించండి.

✪  బ్రహ్మశ్రీ దైవజ్ఞ తంగిరాల వేంకటకృష్ణ పూర్ణ ప్రసాద సిద్ధాంతి (రేలంగి)
ఫోన్ : (08816) 225809.

సమర్పణ : దైవమ్ డిజిటల్

2 Responses

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *