తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన సిద్ధాంతులు
రేలంగి తంగిరాల వారి పంచాంగం

ధనుస్సు రాశి
వార్షిక ఫలితాలు

ధనుస్సు రాశి జన్మనక్షత్రాలు

మూల నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు.
పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు.
ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం.

ఆదాయ – వ్యయాలు

శ్రీ శార్వరి నామ సంవత్సరం 2020 మార్చి 25 నుండి 2021 ఏప్రిల్ 12 వరకు.
ఈ సంవత్సరంలో ధనుస్సు రాశి జాతకుల ఆదాయ-వ్యయాలు, గౌరవ-అగౌరవాలు.
ఆదాయం – 8; వ్యయం – 11;  గౌరవం – 6; అగౌరవం – 3.

గ్రహ సంచారం

ధనుస్సు రాశి జాతకులకు- గురువు మార్చి 29, 2020 నుండి 2ట సువర్ణమూరి (సర్వ సౌఖ్యాలు)గా, జూన్ 29 నుండి 1ట సువర్ణమూర్తిగా, నవంబరు 20 నుండి 2ట రజతమూర్తిగా, తదుపరి ఏప్రిల్ 5, 2021 నుండి 3ట రజతమూర్తిగానూ సంచరిస్తాడు. శ్రీ శార్వరి సంవత్సరమంతా శని 2ట రజతమూర్తి (సౌభాగ్యం)గా సంచరిస్తాడు. రాహు-కేతువులు శార్వరి సంవత్సరాది నుండి సెప్టెంబరు 23, 2020 వరకు సప్తమ, జన్మస్థానాల్లో తామ్రమూర్తులుగా, ఆ తర్వాత షష్ఠ, వ్యయస్థానాల్లో లోహమూర్తులుగానూ సంచరిస్తారు.

అనుకూల – ప్రతికూలతలు

పై అధికారుల వల్ల ఇబ్బందులు, ఒత్తిడి అధిగమించలేని స్థితి. కార్యాలు చెడతాయి. బుద్ధి కుశలత లేకపోతుంది. సంపద హాని. వృత్తి, ఉద్యోగాల్లో ఆందోళనలు. అధిక శ్రమతో స్వల్ప లాభాలు. తగినంత లాభాలు రాకపోవడం జరుగుతుంది. ధనుస్సు రాశి వారికి జన్మ గురుని సంచార కాలంలో- స్థానచలనం, అనారోగ్యం, పుణ్యక్షేత్ర దర్శనాలు, సాధుజన సేవనం, నిరంతరం ఆధ్యాత్మిక గ్రంథ పారాయణ చేస్తారు. గురుని ధనస్థాన సంచారకాలం- ధనలాభం, కుటుంబ సౌఖ్యం కలగజేస్తుంది.

శుభ ఫలితాలు

భయం, కళత్రమూలక పీడలు సూచిస్తున్నా, గురు – శనులు మూర్తిమంతంచే శుభఫలితాలు ప్రసాదిస్తారు. దోషాలు తొలగి, సమస్త ఐశ్వర్యాలు కలుగుతాయి. శార్వరి సంవత్సర ద్వితీయార్థంలో సుఖ సౌఖ్యాలు, శత్రుజయం. ధనుస్సు రాశి వారికి శార్వరి సంవత్సర ఉత్తరార్థంలో గురుబలం ఉంది. విద్యార్థులు సంవత్సర ఉత్తరార్థంలో శ్రమించి ఉత్తీర్ణత సాధిస్తారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు అధికారుల మన్ననలు, ప్రశంసలు పొందుతారు. రైతులకు రెండు పంటలూ విశేష లాభాలు. వ్యాపారస్తులకు సంవత్సర ఉత్తరార్థంలో లాభాలు. పాడి, మత్స్య, పౌల్ట్రీల వారికి సంవత్సర ఉత్తరార్థంలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. వృత్తి పనివారికి, గాయకులకు, క్రీడాకారులకు, పండితులకు అత్యంత ప్రోత్సాహకరంగా సాగుతుంది. న్యాయవాదులకు, వైద్యులకు ఉత్తరార్థంలో లాభసాటిగా ఉంటుంది.

ఉపాయాలు

ధనుస్సు రాశి జాతకులకు ఏలినాటి శని ప్రభావం మూడవ, ఆఖరి భాగానికి రావడం వల్ల గతం కంటే కొంతమేరకు ఉపశమనం కలిగినప్పటికీ జాగ్రత్త అవసరం. దోష నివారణకు సదా ఈశ్వరాభిషేకం చేయించడం మంచిది. రాజకీయ నాయకులకు శార్వరి సంవత్సర ఉత్తరార్థంలో ప్రజాదరణ. గురుని జన్మరాశి సంచార దోష నివారణకు గురువారం నాడు శనగలు దానమివ్వాలి. నిత్యం శివదర్శనం చేయాలి.

జన్మనక్షత్రాల ప్రభావం

✶  మూలా నక్షత్రం జాతకులకు- కుటుంబంలో శుభకార్యాలు, పుత్ర పౌత్ర వివర్ణనం, ధననిల్వ. పదిమందిలో ఆకర్షణగా నిలచి, ఇతరులను ప్రభావితం చేసే నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు.
✶  పూర్వాషాఢ నక్షత్రం వారికి- గత ఇబ్బందులు తొలగి, క్రమేపి ఆర్థిక విషయం గాడిన పడుతుంది. శార్వరి సంవత్సరాంతానికి ఆర్థిక పురోగతిని సాధిస్తారు. 
✶  ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం జాతకులకు- ఉద్యోగ ప్రాప్తి. ఉద్యోగస్తులకు ఉన్నతులు. సుఖ జీవనాన్ని పొందుతారు.

అంకెల్లో అదృష్టం

ధనుస్సు రాశి వారికి ‘3’ అదృష్ట సంఖ్య. 1, 2, 5, 9 తేదీల సంఖ్యలు- ఆది, బుధ, గురువారాలతో కలిస్తే మేలు కలుగుతుంది.

జూలై 2020 : మాస ఫలితం

ఆదాయపు పన్ను సంబంధ దాడులను చవి చూడవలసి వస్తుంది. మిమ్మల్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం ఉంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మన్యుసూక్త సహితంగా అభిషేకం చేయించడం వల్ల శత్రువుపై విజయం సాధిస్తారు.

✪  బ్రహ్మశ్రీ దైవజ్ఞ తంగిరాల వేంకటకృష్ణ పూర్ణ ప్రసాద సిద్ధాంతి (రేలంగి)
ఫోన్ : (08816) 225809.

సమర్పణ : దైవమ్ డిజిటల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *