ఆషాఢ మాసం

కర్కాటక సంక్రాంతితో
‘దక్షిణాయన’ ప్రవేశం

సూర్యుడు ప్రతి నెలలోనూ ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశిస్తుంటాడు. దీనికే ‘సంక్రమణం’ అని పేరు. కర్కాటకంలోకి సూర్యుడు ప్రవేశించడంతోనే దక్షిణాయనం ఆరంభమవుతుంది. అంటే- సూర్యుడు ఈ రాశిలోకి ప్రవేశించినప్పటి నుంచి తిరిగి మకర రాశిలోకి వెళ్లేంత వరకు ఉండే కాలం ‘దక్షిణాయనం’. ఈ అయనంలో సూర్యుడు భూమధ్య రేఖకు దక్షిణంగా సంచరిస్తాడు. దేవతలకు ఉత్తరాయణం పగలు కాగా, దక్షిణాయనం రాత్రి. ఉత్తరాయణం దేవతలకు, దక్షిణాయనం పితృదేవతలకు ప్రీతికరం.

ఉగ్రదేవతా మూర్తుల ప్రతిష్ఠ

దక్షిణాయనంలో- దేవతా ప్రతిష్ఠ, గృహ ప్రవేశం, ఉపనయనం, వివాహం వంటి శుభకార్యాలను చేయడం మంచిది కాదంటారు. కాని, దక్షిణాయనంలో ఉగ్రదేవతా రూపాలను- అంటే సప్తమాతృకలు, భైరవ, వరాహ, నరసింహ, మహిషాసురమర్దిని, దుర్గ లాంటి దేవతా మూర్తులను ప్రతిష్ఠించవచ్చని వైఖానస సంహిత చెబుతోంది.

కొన్ని ప్రాంతాల్లో- ఈ పుణ్యకాలంలో ఆషాఢ స్నానాలు ఆచరించే సంప్రదాయం ఉంది.
ఈ మాసంలో చేసే స్నానం, దానం, జపం, పారాయణలు విశేష ఫలాన్నిస్తాయి. ఆషాఢంలో పాదరక్షలు, గొడుగు, ఉప్పు మొదలైన వాటిని దానం చేయడం మంచిది.
కర్కాటకంలోను, కన్యలోను, ధనుస్సులోను, కుంభరాశిలోను సూర్యుడు ఉన్నప్పుడు చూడాకర్మ మొదలైనవి నిషిద్ధాలు.

శ్రావణ మాసం

శ్రావణం మాసం అంటేనే శుభమాసం. ఈ నెలలో వచ్చే నాలుగు సోమవారాలు, మంగళవారాలు, శుక్రవారాలు, శనివారాలు ఎంతో పవిత్రమైనవి. అలాగే జంధ్యాల పౌర్ణమి, కృష్ణాష్టమి, పోలాల అమావాస్య… ఇలా అనేక పర్వదినాలు, పండుగలతో హిందువులందరి ఇళ్లల్లోనూ హడావుడి కనిపిస్తుంది. కొత్త చీరలు, బంగారు వస్తువులు కొనడం, ఇంటిని శుభ్రపర్చడం లాంటి పనులను శ్రద్ధగా ఆచరించే మహిళలు నోములు, వ్రతాలు చేయడానికి సన్నద్ధమవుతుంటారు. గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి, పసుపు రాసి కుంకుమ, బియ్యపుపిండితో పెట్టిన ముగ్గులతో అలంకరించిన గడపలతో ప్రతి ఇల్లూ సందడిగా ఉండి ఒక విధమైన లక్ష్మీకళతో శోభిల్లుతుంది.

– భాగవతుల సుబ్రహ్మణ్యం

సమర్పణ : దైవమ్ డిజిటల్

3 Responses

  1. సర్ నాకు దైవమ్ బుక్ డిజిటల్ నా ఫోనుకు టెలిగ్రాం కు పిడి ఎఫ్ పంపండి దయవుంచి

    1. నమస్కారం.
      PDF ఫైల్స్ పంపడం కుదరదు. ఈ వెబ్ సైట్లో చూసుకోండి.
      ధన్యవాదాలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *