నదీస్నాన ఫలితం

కుటుంబ సభ్యులందరూ కలసి నదిలో కానీ లేక సముద్రంలో కానీ స్నానం చేయాలి. దీనివల్ల కుటుంబ సభ్యుల్లో పరస్పర స్నేహం, సామరస్యం వృద్ధి చెందుతుంది. ఫలితంగా కుటుంబ జీవనం సుఖమయమౌతుంది. కుటుంబ జీవనంలో క్లేశం అధికమై అందరూ కలసి వెళ్లడం అసాధ్యమైతే, వ్యక్తులు స్నానానికి వెళ్లకపోయినా వారు వేసుకొన్న వస్త్రాన్ని తీసుకెళ్లి నీటిలో ముంచాలి.

✡ కుటుంబంలోని స్త్రీల వల్ల అశాంతి ఏర్పడుతుంటే- అటువంటి వారిని శాంతపర్చడానికై చంద్రమణిని వెండి ఉంగరంలో పొదిగి, కుడిచేతి అనామికకు శుక్లపక్ష సోమవారం నాడు ధరింపచేయాలి. ఇంతేకాక చంద్రమణిని వెండి లాకెట్లో వేసి, వెండిగొలుసులో లేదా తెల్లదారంతో చుట్టి ధరించాలి.

✡ సర్వకార్య సాఫల్య ప్రాప్తి కోసం- పొద్దుతిరుగుడు పువ్వు రసంలో ఎర్రచందనం కలపాలి. ఆ గంధంతో వెండిరేకుపై మల్లెచెట్టు కాడతో తన పేరు రాసుకోవాలి. దానిని ఎర్రని వస్త్రంలో చుట్టి జాతకుడు తన దగ్గర ఉంచుకోవాలి (పర్సులోనైనా పెట్టుకోవచ్చు).

✡ అసాధ్య రోగ నివృత్తికై- జిల్లేడు, ఆముదం చెట్ల వేర్లను తీసుకొచ్చి, సిందూరంతో కలిపి, ధూపం వేయాలి. ‘ఓం హ్రీం ఫట్ స్వాహా’ మంత్రాన్ని ఏడుసార్లు పఠించి, ఎడమచేతితో దానిని తీసి రోగికి చూపించి, ఇంటి గుమ్మం బయట భూమి లోపల పెట్టాలి. బాధితుని వ్యాధి తొలగుతుంది.

సమర్పణ : దైవమ్ డిజిటల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *