నిరాశ – నిస్పృహ తొలగింపు

ఇది రోగం కాని రోగం. ఎర్రసిరాతో రోగి పేరు, తండ్రి పేరు రాయాలి. మట్టిపిడతలో పాలు-అన్నం, చక్కెర కలిపి, రోగి చేత స్పృశింప చేయాలి. ‘ఓం హ్రీం స్వాహా’ మంత్రాన్ని 11 మార్లు లేదా ఏడుసార్లు పలకాలి. తరవాత రాత్రి 12 గంటలకు- ‘నీ స్థానంలో చేర్చడానికి నిన్ను తీసుకెళుతున్నాను’ అని దూరంగా వదిలి రావాలి. వెనక్కి తిరిగి చూడకూడదు. ఇద్దరు వ్యక్తులు తోడుగా ఉండటం అవసరం. వెళ్లేటప్పుడు ఒకరికొకరు మాట్లాడకూడదు.

రోగ నివారణ

వెండిగిన్నెలో నీరు నింపి, కుంకుమపువ్వును కలపాలి. ఈ గిన్నెను రోగి నిద్రించే సమయంలో తలగడ దగ్గర ఉంచితే వ్యాధి నివారణ ఫలితం పొందుతారు.

✡  ఏదైనా శుభ నక్షత్రంలో ఉత్తరేణి వేరును తెచ్చి, కుడిచెవికి కట్టుకొంటే తేలు భయం నివారణవుతుంది. 

✡  ఆదివారం నాడు తెల్లగన్నేరు చెట్టు వేరును తెచ్చి, కుడిచేతికి కట్టుకొంటే అగ్నిభయం తొలగుతుంది.

✡  నిమ్మచెట్టు ఆకులు, ఆవాలు, నెయ్యితో ధూపం వేయడం వల్ల శిశువుకు ఎటువంటి బాధలు కలగవు. 

సమర్పణః దైవమ్ డిజిటల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *