గృహ రక్షణ

కుటుంబంలో అనేకమంది సభ్యులుంటారు. వారందరి ఆలోచనలు ఒకే విధంగా ఉండాల్సిన అవసరం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో సభ్యుల మధ్య స్నేహం, సామరస్యత లోపించి, ఉదాసీనత, వైమనస్యత ఏర్పడుతుంది. ఇటువంటి స్థితి నుండి రక్షణకై తెల్లచందనంతో తయారుచేసిన ప్రతిమను లేక వస్తువును ఇంట్లో కుటుంబ సభ్యులందరి దృష్టిపడే చోట అమర్చాలి.

✡  కుటుంబంలోని పురుషుల మధ్య సామరస్యత లోపించి వివాదాలు ఏర్పడుతుంటే- అటువంటి ఇంట్లో కదంబ వృక్షం కొమ్మను తెచ్చి ఉంచాలి. ప్రతి పౌర్ణమి రోజున పాతకొమ్మను కదంబ వృక్షం దగ్గర వదిలి కొత్త కొమ్మను తెచ్చిపెట్టాలి. కొమ్మలో కనీసం ఏడు ఆకులైనా ఉండాలి. ఆకులు చిరిగిపోయి, విరిగిపోయి ఉండకూడదు.

✡  కుటుంబంలోని వృద్ధులు, యువకుల మధ్య పరస్పర వివాదాల వల్ల వాతావరణం అశాంతిమయం అవుతుంటే ఇంట్లోని దక్షిణ భాగంలో వృద్ధులకు; తూర్పు, ఉత్తర భాగాల్లో యువకులకు గదులు ఏర్పరచాలి. వారి గదుల ద్వారాలపై పౌర్ణమి రోజున అశోకచెట్టు ఆకులను ఉంచాలి. 

✡  కుటుంబంలోని స్త్రీల మధ్య సామరస్యత లోపించి వివాదాలతో కుటుంబ శాంతికి విఘ్నం కలుగుతుంటే కుటుంబంలోని స్త్రీలందరూ ఒకేసారి ఎర్రని వస్త్రాలు ధరించకూడదు.

✡  కుటుంబ సభ్యుల మధ్య అకారణంగా విభేదాలు తలెత్తుతుంటే- ఇంట్లోని వారు గురువారం రోజున జుట్టు, గడ్డం, మీసం కత్తిరించకూడదు. గృహంలోని పూజాస్థలంలో గంగాజలాన్ని ఉంచాలి.

సమర్పణ : దైవమ్ డిజిటల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *